ఇస్లామాబాద్ : పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ జరిపిన దాడుల్లో 11 మంది(Pakistan soldiers killed) సైనికులు మరణించారని పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. వీరిలో సైనికులతో పాటు ఐదుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నట్లు పాకిస్థాన్ ఆర్మీ వివరించింది. గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పింది. ఈ మేరకు పాకిస్థాన్ ఆర్మీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 40 మంది పౌరులు కూడా పలు చోట్ల జరిగిన దాడుల్లో మృతి (Pakistan soldiers killed) చెందినట్లు పాక్ ప్రకటించింది. పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా సైనిక దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో దాదపు 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులకు సంబంధించిన మౌలిక సదుపాయాలను సైతం ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని పాకిస్థాన్ సరిహద్దునున్న రాష్ట్రాలకు చెందిన జిల్లాలపై పాకిస్థాన్ డ్రోనులు, క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడులను భారత్ తిప్పికొట్టింది. దాదాపు నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల నడుమ శనివారం సాయంత్రం మే 10వ తేదీ ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించిన సంగతి తెలిసిందే.