మన తెలంగాణ/నిజామాబాద్ క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపిన 11గురికి జైలు శిక్ష, 6 మందికి జరిమానావిధించినట్లు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం తాగి వాహనాలు నడిపిన 17 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారీగా పట్టుబడిన వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి, మంగళవారం మార్నింగ్ కోర్టులో హాజరుపర్చగా స్పెషల్ జుడీషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్, టౌన్ 1 పియస్ పరిధిలో రాజుకు, టౌన్ 2 పియస్ పరిధిలో రాథోడ్ సూర్యకు, టౌన్ 4పియస్ పరిధిలో వేముల చిన్న యోగేష్‌కు 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
అలాగే టౌన్ 4 పియస్ పరిధిలో నర్సారెడ్డి, మల్లికార్జున్, రాజు ఒక్క రోజు జైలు శిక్ష నవీపేట్ పియస్ పరిధిలోని పండనోళ్ల, టౌన్ నిజామాబాద్ రూరల్ పియస్ పరిధిలోని నయాబ్ రసూల్ 02 రోజులు జైలు శిక్ష, బాన్సువాడ సాయిలు తండ్రి పెడ సాయిలు, బానుఉ్సవాడ 02 రోజులు జైలు శిక్ష, డిచ్‌పల్లి పియస్ పరిధిలోని షేక్ సకీమ్‌కి 1 రోజు జైలు శిక్ష, డిచ్‌పల్లి పియస్ పరిధిలోని సిద్దులుకు 1రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.