ఓ ప్రధాన నదిపై నిర్మిస్తున్న రైల్వే వంతెన కూలి 12 మంది కార్మికులు మృతి చెందగా, మరో నలుగురు గల్లంతైన సంఘటన వాయువ్య చైనాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. వాయువ్య చైనాలో క్వింఘై ప్రాంతంలోని బ్రిడ్జిపై పదహారు మంది కార్మికులు పని చేస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో స్టీల్ కేబుల్ తెగిపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్న కార్మికులు ప్రమాదానికి గురైనారు. ఈ ఘటనలో 12 మంది చనిపోగా మరో నలుగురు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.గల్లంతైన కార్మికులను వెతికేందుకు పడవలు, హెలికాప్టర్, రోబోలను ఉపయోగిస్తున్నారని చైనా వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. వంతెన డెక్ తాలూకు వంపుతిరిగిన భాగం క్రింద ఉన్న ‘ఎల్లో నది’లోకి వేలాడుతూ కనిపించింది. కూలిపోయిన ఈ వంతెన 1.6 కిమీ. పొడవు, నది ఉపరితలం డెక్ నుండి 55 మీటర్ల ఎత్తులో ఉందని ‘చైనా డైలీ’ అనే అక్కడి ఇంగ్లీష్ వార్తాపత్రిక పేర్కొంది.
చైనాలో కూలిన వంతెన.. 12 మంది కార్మికులు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -