- Advertisement -
పెషావర్: పాకిస్థాన్ లోని వాయువ్య ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లో గత నాలుగు రోజుల్లో ఆర్మీ నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 12 మంది సైనికులు, 35 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. మిలిటరీ మీడియా విభాగానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పిఆర్)ఈ ఆపరేషన్ల వివరాలను శనివారం వెల్లడించింది. బజౌర్ జిల్లాలో భద్రతాదళాలు ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్వహించిన ఆపరేషన్‌లో తీవ్రమైన ఎదురెదురు కాల్పుల్లో 22 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఎన్కౌంటర్ దక్షిణ వజిరిస్తాన్ జిల్లాలో జరిగింది. తెహ్రేక్ ఇ తాలిబన్(టిటిపి) ఉగ్రవాదులు హతం కాగా, కాల్పుల్లో 12 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఐఎస్పిఆర్ వెల్లడించింది. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్రదాడుల్లో అఫ్గాన్ జాతీయుల ప్రమేయం ఉందని ఐఎస్పిఆర్ ఆరోపించింది.
- Advertisement -