Friday, July 4, 2025

కత్తిపోట్లతో నగ్నంగా బాలుడి శవం

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణ రీతిలో 14 ఏండ్ల బాబుపై అఘాయిత్యం జరిగింది. కత్తులతో దాడి చేసి ఈ బాలుడిని బాలల బృందమే చంపేసింది. ఇక్కడి హైదర్పూర్ ప్రాంతంలో మురికి కాలువలో ఒళ్లంతా కత్తిపోట్లతో గాయాలతో , నగ్నంగా దొరికిన బాబు శవం పడి ఉండగా పోలీసు వర్గాలు గుర్తించాయి. ఈ బాబును నలుగురు బాల నేరస్తులు సహా మొత్తం ఎనమండుగురు పట్టుకుని బట్టలూడదీసి చిత్రహింసలు పెట్టారని వెల్లడైంది. కత్తిపోట్లకు గురై ఈ బాలుడు చనిపోగా పక్కనే ఉన్న కాలువలో పడేసి వెళ్లారు.

సిర్సాపూర్‌లోని జీవన్ పార్క్‌కు చెందిన ఈ బాలుడిని బాలులు అపహరించుకుని వెళ్లారు. అంతకు ముందటి ఏదో ఒక ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నారని దాడికి దిగిన వారిని పట్టుకుని విచారించిన క్రమంలో వెల్లడైంది. పలు సాంకేతిక ప్రక్రియలతో ఈ దారుణ హత్యకు పాల్పడ్డ వారిని పట్టుకుని విచారిస్తున్నారు. పట్టుబడ్డ వారిలో ఒక బాలుడిపై గత ఏడాది దాడి జరిగింది. ఇందుకు ప్రతీకారంగానే ఇప్పుడు తోటి బాలుడిని కిరాతకంగా ఇతరులతో కలిసి చంపివేసినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News