- Advertisement -
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సాయుధ దళాలు దాడులు జరపడంతో.. పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఓసి) వెంబడి ఉన్న భారత ప్రాంతాలపై కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పుల్లో మృతి చెందిన భారత పౌరుల సంఖ్య 15కు చేరినట్లు అధికారులు తెలిపారు. పాక్ సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో మరో 45 మంది పౌరులు గాయపడినట్లు చెప్పారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అమాయక ప్రజలను పాక్ సైన్యం పొట్టనపెట్టుకుందని, దీనికి కూడా ప్రతీకారం తీర్చుకుంటామని భారత సైన్యం హెచ్చరించింది.
- Advertisement -