Tuesday, May 13, 2025

కల్తీ మద్యం తాగి 15 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

పంజాబ్‌: అమృత్‌సర్‌లోని మజితా ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి 15 మంది మరణించగా, మరో ఆరుగురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై అమృత్‌సర్ ఎస్ఎస్పీ మనీందర్ సింగ్ మాట్లాడుతూ.. “ మజితాలో సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని మాకు సమాచారం అందింది. మేము వెంటనే చర్యలు తీసుకుని నలుగురిని అరెస్టు చేశాం. ప్రధాన సరఫరాదారు ప్రభ్జీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నాం. విచారణ సమయంలో ప్రభ్జీత్ సింగ్.. కింగ్‌పిన్ సరఫరాదారు సహబ్ సింగ్ పేరు చెప్పాడు. అతన్ని కూడా అదుపులోకి తీసున్నామని.. ఈ మద్యాన్ని ఎవరి నుండి కొనుగోలు చేశాడో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. ఈ విషాద సంఘటన తర్వాత కల్తీ మద్యం సరఫరా, తయారీలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది” అని తెలిపారు. తయారీదారుల కోసం పోలీసులు అనుమానిత ప్రదేశాలపై దాడులు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News