- Advertisement -
15మంది మృతి..43మందికి గాయాలు
మృతుల్లో నలుగురు,చిన్నారులు పూంఛ్,
తంగ్దర్ సెక్టార్‌లలో తెగబడిన పాక్ సైన్యం
న్యూఢిల్లీ: సరిహద్దు రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగపడింది. కాల్పులలో నలుగురు పిల్లలతో సహా 15 మంది మరణించారు. పాక్ రేంజర్లు విపరీతంగా జరిపిన కాల్పుల్లో సరిహద్దు గ్రామాల ఇళ్లలోకి తూటాలు దూసుకువచ్చాయి. కశ్మీర్ లోని యూరి, తంగ్ ధర్ సెక్టార్ లలో పాక్ ఫిరంగి కాల్పులకు తెగపడింది. జమ్మూ లోని పూంచ్ లోనూ పెద్దఎత్తున కాల్పులు జరిగాయి. 1971 భారత – పాక్ యుద్ధం తర్వాత మొదటి సారిగా గ్రామాలలోని ఇళ్లు ప్రభుత్వ భవనాలపై పాక్ ఫిరంగి గుండ్లు పడ్డాయని స్థానికులు చెబుతున్నారు.
- Advertisement -