Friday, June 20, 2025

16 ఏళ్ల బాలుడిపై యువతి లైంగిక దాడి..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 16 ఏళ్ల బాలుడిపై ఓ యువతి లైంగిక దాడికి పాల్పడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంటి పక్కనే ఉండే 28 ఏళ్ల యువతి, బాలుడిని లోబర్చుకుని లైంగిక దాడి చేసినట్లు జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదు అయ్యింది. తనను బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేసిందని.. తనతో అసభ్యకరంగా ప్రవర్తించిందని బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లిదండ్రల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు యువతిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News