మృతులంతా ఉమ్మడి కుటుంబానికి
చెందిన వారు మరణించిన వారిలో
ఎనిమిది మంది చిన్నారులే పొగతో
ఊపిరాడక నిద్రలోనే కన్నుమూసిన
బాధితులు ఎసి కంప్రెషర్ పేలి
వ్యాపించిన విష వాయువులు రెండో
అంతస్తులోని నలుగురు సేఫ్ షార్ట్
సర్యూట్‌తో చెలరేగిన అగ్నికీలలు
మంటలు ఆర్పిన రోబో సెలవులకు
ఇంటికి వచ్చి కన్నుమూసిన బంధువులు
ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్
గాంధీ, బిఆర్‌ఎస్ నేత కెసిఆర్ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోడీ
రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన
రాష్ట్ర ప్రభుత్వం ఘటనా స్థలికి
చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించిన
డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి పొన్నం,
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇరుకైన
భవనమే మృతులు పెరగడానికి కారణం
మన తెలంగాణ/చార్మినార్: హైదరాబాద్ పాతబస్తీలో ఆదివా రం ఉదయం పెను విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘా తం కారణంగా నగల వ్యాపారి ఇంట్లో భారీ అగ్నిప్రమా దం చోటు చేసుకుంది. ఇళ్లంతా దట్టమైన పొగలు, మంటలు అలముకొని నిద్రలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన 17 మంది స్పృహ కోల్పోయారు. విషయం తెలుసుకున్న సహాయ క బృం దాలు సంఘటనా స్థలానికి చేరుకొని అతికష్టం మీద భవనం తలుపులు బద్దలు కొట్టి, గోడకు కన్నం వేసి లోనికి ప్రవేశించా రు. విగత జీవులుగా పడి ఉన్న ఎనిమిది మంది పిల్లలతో సహా 17 మందిని పది అంబులెన్స్‌ల ద్వారా నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, డిజిపి జితేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి, నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా, సిటీ డీఎఫ్‌ఓ వెంకన్నలు సంఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, జిల్లా మంత్రి పొ న్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎం పీలు అసదుద్దీన్ ఓవైసీ, అనిల్ కుమార్ యాదవ్, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కార్పొరేటర్లు సంఘటనా స్థలిని సందర్శించారు. సహాయక చర్యలకు తోడ్పాటు నందించారు. ఈ హృదయ విదారకమైన సంఘటన వివరా లు.. చారిత్రక చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌస్ వద్ద ప్ర హ్లాద్ మోది, భార్య మున్నీబాయితో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. అతని ఇద్దరు కుమారులు రాజేందర్ మోది, పంకజ్ మోదిలు కలిసి భవనం దిగువన గల మల్గీలలో కృష్ణ, మోది ముత్యాల దుకాణాలను నిర్వహిస్తున్నారు. రెండంతస్థుల భవనంలోని మొదటి అంతస్తులో ఉమ్మడిగా కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. వేసవి సెలవులు కావటంతో ప్రహ్లాద్ మోది బంధువులు వారింటికి వచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గదిలో విద్యుదాఘాతం (షార్ట్ సర్కూ ట్) చోటు చేసుకొని మంటలంటుకున్నాయి. అవి క్రమేణ ఉడ్‌వర్క్ అలంకరణకు అంటుకొని విస్తరించాయి.
ఇంతలో ఏసీ కంప్రెషర్ పేలి మంటలు మరింత పెరిగాయి. కుటుంబ స భ్యులు నిద్రలో ఉండటంతో మంటల విషయం గమనించేలోగ ఇంటి నిండా దట్టమైన పొగలు, మంటలు అలముకున్నాయి. విషయాన్ని గమనించిన కొంద రు యువకులు కేకలు వేయటంతో ఆ మార్గంలో మక్కా మసీదులో ప్రార్థనలు ముగించుకొని వస్తున్న కొందరు స్థానికులు వెంటనే స్పందించారు. చా ర్మినార్ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అం దించారు. ఉదయం 6.16 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం హుటాహుటిన అక్కడికి చే రుకొన్నారు. అయితే రెండవ అంత స్థు భవనంలోని మొదటి అంతస్థులోకి ప్రవేశించేందుకు ఒకే మెట్ల మార్గం ఉండటం, పైకి వెళ్ళేందుకు వీలు లేక పోవటం తో నిచ్చెన సహాయంతో మొదటి అంతస్థులోకి చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టా రు. గోడకు రంధ్రం వేశారు. దట్టమైన పొగ, మంటలు ఉండటంతో ప్రత్యేక వస్తువులు, ఆక్సిజన్ మాస్క్‌లు ధరించిన సహాయక బృందాలు లోనికి వెళ్ళి చూడగా అందులో నిద్రిస్తున్నవా రు స్పృహతప్పి ఉన్నారు. వెంటనే ఆభవనంలోని ఎనిమిది మంది చిన్నారులతో సహా 17 మందిని పది అంబులెన్స్‌ల ద్వారా నగరంలోని పలు ఆసుపత్రులకు తరలించారు.
ఘట నా స్థలిలో కొందరు, మార్గ మధ్యంలో మరికొందరు మృతిచెందారు. రెండవ అంతస్థులో ఉన్న నలుగురిని సహాయక బృందా లు నిచ్చెన సహాయంతో రక్షించారు. 12 అగ్నిమాపక కేంద్రా ల నుండి 17 మంది అగ్నిమాపక అధికారులు, 70 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 శకటాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబోట్‌తో రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. సహాయక చర్యలలో పాల్గొన్న డిఎఫ్‌ఓ ఒకరు అనారోగ్యానికి గురి కాగా అతనిని ఆసుపత్రికి తరలించారు. భారీ అగ్నిప్రమాదం విషయం తెలిసిన పాతబస్తీ ప్రజలు, వివిధ పార్టీల నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అగ్నిప్రమాదం, ఒకే కుటుంబంలోని 17 మంది మృతి చెందటంపై పాతబస్తీలో చర్చనీయాంశమైంది.
ప్రధాని మోడీ, సిఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
చార్మినార్ గుల్జార్‌హౌస్ ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోది, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఒకే కుటుంబంలోని 17 మంది మృతి చెందటం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి రెండు లక్షలు, క్షతగాత్రులకు 50వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఘటనపై ఫోన్లో మంత్రి పొన్నంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.