Tuesday, August 26, 2025

లైంగిక వేధింపులు భరించలేక తనువు చాలించిన బాలిక

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, రంగంపేట గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక మృతి సంఘటన సంచలనం రేపింది. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక ఇంట్లో ఉండి ఫిట్స్ రావడంతో తండ్రి ఆమెను సోమవారం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు బాలిక పరిస్థితి విషమంగా ఉందని, పెద్దాసుపత్రికి తరలించాలని సూచించడంతో సిరిసిల్లకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృత్యువుతో పోరాడి మృతి చెందింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

తన కూతురు మరణానికి గాలిపెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పిల్లి వినోద్, జాషు, రంగపేట గ్రామానికి చెందిన సందవేని సతీష్ అనే యువకుడు కారణమంటూ పోలీసులకు తెలిపారు. తమ కుమార్తె ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తూ కొన్ని రోజుల క్రితం రాసుకున్న మూడు పేజీలకు పైగా గల లేఖను వారు పోలీసులకు అందజేశారు. తన కుమార్తెను ఆ ముగ్గురు యువకులు శారీరకంగా వాడుకొని, అశ్లీల వీడియోలు చిత్రీకరించి మానసికంగా క్షోభకు గురిచేశారని, దీంతో వారి వేధింపులు తాళలేక ఎవరికీ చెప్పుకోలేక దీనస్థితిలో ఇంట్లో ఉండి వెక్కివెక్కి ఏడ్చుకుంటూ చివరకు అనారోగ్యం పాలై, పస్తులుండి మృతి చెందిందని వాపోయారు.

తండ్రి నోరు విప్పడంతోనే నమ్మలేని నిజాలు
మొదటగా అందరూ బాలిక తీవ్ర జ్వరంతో ఫిట్స్ రావడంతో మృతి చెందిందని భావించారు. కానీ బాలిక తల్లికి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు. బాలిక మృతికి తండ్రే కారణమంటూ తొలుత ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా బాలిక తండ్రి నోరు విప్పి తన కూతురు చావుకు గాలిపెల్లి గ్రామానికి చెందిన పిల్లి వినోద్, జాషు, రంగపేట గ్రామానికి చెందిన సందెవేళ సతీష్ కారణం అంటూ తెలిపాడు. వీటికి సంబంధించిన తన మొబైల్‌లో ఉన్న అశ్లీలమైన వీడియోలు, పోలీసులకు, కుటుంబ సభ్యులకు చూపించాడు. ఆ ముగ్గురు యువకులు తన కుమార్తెను కత్తితో బెదిరించి, మానసికంగా,

శారీరకంగా వేధించారని తండ్రి ఆవేదనతో రోదించాడు. ఈ విషయం పెద్ద ఎత్తున దుమారం రేపడంతో జిల్లా ఎస్‌పి మహేష్ బి గీతేను బాలిక కుటుంబ సభ్యులు కలిసి మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎస్‌పి వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, బాలిక మృతికి గల కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లంతకుంట ఎస్‌ఐ సిరిసిల్ల అశోక్ తెలిపారు. బాలిక మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News