Monday, September 15, 2025

17వ మినీ హ్యాండ్‌బాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ గోడపత్రికను ఆవిష్కరించిన సిఎం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 29 వరకు నిజాం కళాశాలలో జరిగే 17వ హెచ్‌ఎఫ్‌ఐ మినీ హ్యాండ్బాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సోమవారం ఆవిష్కరించారు. క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, రాష్ట్రంలోని యువత క్రీడల వైపు మరింత ఆసక్తితో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని నిర్వాహకులు తెలిపారు. పోటీలు నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డి, తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్రెడ్డి రాంరెడ్డి, తెలంగాణ ఖో-ఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, జాయింట్ సెక్రటరీ రమేష్, రిఫరీస్ బోర్డు చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సోలిపురం వెంకట్రాంరెడ్డి, ఎంఎంసి డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News