సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎంజి రోడ్డులో గల సాయి సంతోషి జ్యుయలరీ షాపు దుకాణదారుడు తెడ్ల కిషోర్ ఎప్పటిలాగే ఆదివారం దుకాణాన్ని మూసివేశాడు. సోమవారం ఉదయం దుకాణం తెరచి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. భారీగా బంగారం దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఘటన స్థలాన్ని జిల్లా ఎస్‌పి నరసింహ పరిశీలించి అనంతరం మాట్లాడుతూ.. దొంగలు బంగారం షాపు వెనుక నుండి బాలాజీ గ్రాండ్ ఎదురుగా ఉన్న రెండు బాత్రూంలోకి రంధ్రం పెట్టి గ్యాస్ కట్టర్‌తో షట్టర్‌ను కట్ చేసి లోపలికి వెళ్లారని తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు
18 కేజీల బంగారం చోరీకి గురైనట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. 2011లో పట్టణంలో మరో బంగారం దుకాణం ఇదే తరహాలో చోరీ జరిగినట్లు గుర్తు చేశారు. కేసును ఛేదించడానికి 5 పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దొంగతనానికి పాల్పడ్డ వారిని త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్గంలో ఉన్న సిసిటివి కెమెరాలు పరిశీలించాల,ని ఆధారాలను సేకరించాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్ టీమ్స్ క్లూస్ సేకరిస్తున్నారని అన్నారు. ప్రజలు, వ్యాపారులు, కమ్యూనిటీ రక్షణలో భాగంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పి సూచించారు. ఎస్‌పి వెంట డిఎస్‌పి ప్రసన్న కుమార్, సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, పోలీసు టెక్నికల్ టీమ్స్, క్లూస్ టీమ్ సిబ్బంది ఉన్నారు.