Friday, May 2, 2025

గద్వాల్ లో 18 వరిగడ్డి వాములు దగ్ధం

- Advertisement -
- Advertisement -

ఉండవెళ్లి: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం ప్రాగటూర్ గ్రామంలో వరిగడ్డి వాములలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10మంది రైతుల 18 వరిగడ్డి వాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. కల్లాల్లో ఉన్న వరిగడ్డి వాములతో పాటు వ్యవసాయ పరికరాలు, ఎద్దుల బండ్లు, మోటార్లు, పైపులు దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే వరిగడ్డి వాములకు నిప్పంటించారని రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News