Wednesday, July 9, 2025

తెగిపడిన 11 కేవీ విద్యుత్ తీగ.. షార్ట్ సర్క్యూట్‌తో 18 గొర్రెలు మృతి

- Advertisement -
- Advertisement -

నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోలు గ్రామంలో 11 కేవీ విద్యుత్ లైన్ మూగ జీవాల పాలిట శాపమైంది. మంగళవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు వైరు తెగిపడగా గొర్రెల పాకలోని మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. పెద్దకొర్పోలులో 11 కేవీ విద్యుత్ లైన్ తెగిపడి గొర్రెల షెడ్డుపై పడి పాక పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. నూకల లక్ష్మీకి చెందిన 18 పెద్ద గొర్రెలు, పిల్లలు మృత్యువాత పడ్డాయి. ఈ సందర్భంగా బాధితురాలు లక్ష్మీ రోదిస్తూ గ్రామంలోని పలు ఇళ్ల మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైరు ఇన్సూలేటర్ ఫెయిల్ కావడంతో విద్యుత్ వైరు తెగిపడిందన్నారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గొర్రెల పాకలోని 18 గొర్రెలు, గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. 20 గొర్రెలు అస్వస్థతకు గురైనట్లు తెలిపింది. గొర్రెల పాక పూర్తిగా దగ్ధం అయిందన్నారు. ఈ ఘటనలో మొత్తం రూ. 4 లక్షల ఆస్తి నష్టం జరిగింది. నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. దీంతో పాటు ఇళ్ల మీదుగా ఉన్న 11 కేవీ లైన్‌ను తొలగించి గ్రామ మధ్యలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మార్చాలని కోరారు. ఇప్పటికే పలువురి పశువులు, మూగ జీవాలు మృత్యువాత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News