- Advertisement -
గాజా స్ట్రిప్‌లో ఆదివారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో కనీసం 30 మంది మరణించారని, వారిలో నీటి సేకరణ కేంద్రంలో నిలబడిన ఆరుగురు పిల్లలు ఉన్నారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. మధ్యవర్తులు కాల్పుల విరమణకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ దాడి జరిగిందని వారన్నారు. ఇదిలావుండగా గాజాలో 21 నెలలపాటు జరిగిన యుద్ధంలో పాలస్తీనీయుల మరణాల సంఖ్య 58,000ను దాటిందని ఆ ప్రాంతంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన లెక్కల్లో పౌరులు, పోరాట యోధుల మధ్య తేడాను గుర్తించలేదు, కానీ చనిపోయిన వారిలో సగానికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నారంది. అమెరికా నేతృత్వంలో ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణకు షరతులను చర్చిస్తున్న తరుణంలో దాడుల వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది.
- Advertisement -