Friday, September 12, 2025

భారత్‌ను ఢీకొట్టేందుకు ఇంగ్లండ్‌ జట్టులోకి 19 ఏళ్ల బౌలర్

- Advertisement -
- Advertisement -

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ త్వరలో ప్రారంభంకానుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్లు తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొట్టేందుకు 19 ఏళ్ల యువ బౌలర్‌ని జట్టులోకి తీసుకుంది. ఇండియా-ఎ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య జరిగిన రెండు అనాధికారిక సిరీస్‌లో రాణించిన ఎడ్డీ జాక్ (Eddie Jack) సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. తొలి టెస్టుకు ఎంపికైన మరో యువ పేసర్ జోష్ టాంగ్ గాయపడటంతో అతనికి ప్రత్యామ్నయంగా జాక్స్‌ని జట్టులోకి తీసుకున్నారు.

జాక్ (Eddie Jack) ఇప్పటివరకూ కేవలం రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అది కూడా ఇండియా-ఎ జట్టుతో ఆడినవే. ఈ మ్యాచ్‌ల నాలుగు ఇన్నింగ్స్‌లో అతను నాలుగు వికెట్లు తీశాడు. ముఖ్యంగా కెఎల్ రాహుల్, యశస్వీ జైశ్వాల్‌లను అతను ఔట్ చేశాడు. దీంతో అతనికి ప్రధాన జట్టులోకి ఆహ్వానం లభించింది. కాగా, తొలి టెస్ట్ మ్యాచ్ లీడ్స్ వేదికగా.. జూన్ 20 నుంచి 24వ తేదీ వరకూ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News