Saturday, July 12, 2025

2.4లక్షల కొత్త రేషన్‌కార్డులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ పండుగ మొదలుకానున్నది. ఈనెల 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీం తో సుమారు 11.30 లక్షల మంది పేదలకు లబ్దిచేకూరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయ డం ద్వారా రేషన్ కార్డులకు డిమాండ్ పెరుగుతోంది. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో 41 లక్షల మందికి కొత్తగా రేషన్ పంపిణీ చేసిన ట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల సంఖ్య 94,72,422 కు చేరుకోగా, దాదాపు 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధిదారులు ప్రభుత్వ ప్రయోజనాలను పొందే అవకాశం కలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News