- Advertisement -
అవినీతి నిరోధక శాఖకు మరో రెండు అవినీతి తిమింగళాలు చిక్కాయి.పెద్దపల్లి జిల్లాలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఎస్‌ఆర్‌ఎస్పీ సూపరింటెండెంట్ శ్రీధర్‌బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్.. ఓ ఉద్యోగి సెలవు విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సదరు ఉద్యోగి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ ప్రకారం.. సదరు ఉద్యోగి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న ఎసిబి అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -