మన తెలంగాణ/సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం, సుగ్లాంపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాలను బలిగొనగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన మౌటం లక్ష్మి, మారయ్య దంపతుల మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న వివాదాలు తారస్థాయికి చేరాయి. సామరస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పంచాయితీలో తీవ్ర ఘర్షణకు దారితీసింది. కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ కు చెందిన లక్ష్మి అనే యువతి, కుటుంబ సభ్యు లు, ఓదెల మండలానికి చెందిన మారయ్య అనే యువకుడి కుటుంబ సభ్యులు మంగళవారం సుగ్లాంపల్లిలో ‘పంచాయితీ’ కోసం సమావేశమయ్యారు. ఊహించని విధంగా ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి, తీవ్ర ఘర్షణకు దారితీసిం ది.
ఈ ఘర్షణలో ఆగ్రహంతో యువతి తరపు బంధువులు, యువకుడి తరపు బంధువులపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి పెద్దపల్లి ప్రధాన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరొకరి ని కరీంనగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, సమాచారం అందుకున్న వెంటనే డిసిపి కరుణాకర్, ఎసిపి జి.కృష్ణతో కలిసి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆవరణలో విలేకరులకు డిసిపి వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. మృతుల్లో యువతి సోదరుడి స్నేహితుడు, రాఘవాపూర్‌కు చెందిన గాండ్ల గణే ష్, యువకుడి సోదరుడు మోటం మల్లేష్ ఉన్న ట్లు పోలీసులు గుర్తించారు. డిసిపి వెంట పెద్దపల్లి, సుల్తానాబాద్ సిఐలు ప్రవీణ్‌కుమార్, సుబ్బారెడ్డి, ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు, పోలీసులు ఉన్నారు.