Sunday, September 14, 2025

కాలువలో పడి ఇద్దరు మహిళల గల్లంతు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అశ్వారావుపేట రూరల్‌ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, చెన్నాపురం సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలో పడి ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం, పూచికపాడు గ్రామానికి చెందిన నలుగురు మహిళలు తెలంగాణలోని అశ్వారావుపేట మండలం, పూచికపాడుకు కూలి పనుల నిమిత్తం వచ్చారు. అనంతరం తిరిగి స్వగ్రామం వెళ్తుండగా చెన్నాపురం సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలో పడ్డారు. వీరిలో ఇద్దరు సురక్షితంగా బయటకు రాగా పాలడుగల చెన్నమ్మ (50), పచ్చితల వరలక్ష్మి(55) గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News