Saturday, August 16, 2025

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ 20 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి జిల్లా, రామగుండం నియోజకవర్గం, గోదావరి నది పరిధి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. శనివారం సాయంత్రం నుండి 20 గేట్లను ఎత్తి దిగువకు నీరువదులుతున్నట్లు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. ఎగువన భారీగా కురుస్తున్న వర్షాలతోపాటు కడెం ప్రాజెక్టు నీటిని వదలడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోందని అన్నారు. 20 టిఎంసిల కెపాసిటీ గల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్ల్లో 2,15,501 క్యూసెక్కుల నీరు చేరుతోందని తెలిపారు. ఎగువన గల కడెం ప్రాజెక్టు నుండి 1,61,135 క్యూసెక్కుల నీరు గోదావరి నదిలో వివిధ ప్రాంతాల నుండి చేరుతున్న

వరద నీరు 54,366 క్యూసెక్కుల వల్ల ప్రాజెక్టుకు భారీగా నీరు అందుతోంది. ఎల్లంపల్లి నుండి హైదరాబాద్ నీటి సరఫరాకు 286 క్యూసెక్కుల నీరు, ఎన్‌టిపిసికి 121 క్యూసెక్కుల నీరు నంది పంప్‌హౌస్‌కు 12,600 క్యూసెక్కులన్నీటినీ పంపిణీ చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుండి ప్రాజెక్టు చెందిన 20 గేట్లు ఎత్తి 53,800 క్యూసెక్కుల నీటిని గోదావరి నది దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. నీటిని వదలడంతో గోదావరి పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News