మేషం – నూతనంగా మొదలుపెట్టే పనులలో శ్రమ పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు. ముఖ్య విషయాల్లో బంధుమిత్రుల సలహాలు సంప్రదింపులు అవసరం అవుతాయి.
వృషభం – మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు.
మిథునం – బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. ధన లాభం గోచరిస్తుంది. శత్రువులు తగ్గుతారు.
కర్కాటకం – అభివృద్ధికి తోడ్పడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెలివైన ఆలోచనలతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణాల లో అనుకూలత ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది.
సింహం – ముఖ్యమైన వ్యవహారాలలో మెలకువగా వ్యవహరించాలి.అనవసర విషయాలలో సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రారంభించిన కార్యక్రమాలలో ఉత్సాహంతో పని చేసి విజయం సాధిస్తారు.
కన్య – ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.
తుల – మీ మీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలను పొందగలుగుతారు. బాగా ఆలోచించి పనులు చేయాలి. మిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు.
వృశ్చికం – మీ సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. కార్యసిద్ధి గోచరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి.
ధనుస్సు – చేపట్టిన పనులలో సత్ఫలితాలు పొందగలుగుతారు. విజయ అవకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి.
మకరం – బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేసి తోటి వారి నుంచి ప్రశంసలను అందుకుంటారు.
కుంభం – స్థిరమైన ఫలితాలను చేజిక్కించుకుంటారు. మనః సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభ సూచకం. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది.
మీనం – మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసే వారు ఉన్నారు అని గ్రహిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.