- Advertisement -
కొలంబో: శ్రీలంకలో(Srilanka) ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) సంభవించింది. కోట్మలేలోని కరండీ ఎల్లా నుంచి 78 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -