Saturday, July 12, 2025

ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది నక్సల్స్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం 22 మంది నక్సలైట్లు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపొయ్యారు. వీరిపై కలిపి సంయుక్తంగా రూ 37 లక్షల పారితోషికం ప్రకటితం అయి ఉంది. నక్సల్స్ సరెండర్ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కుతుల్, నెల్నార్, ఇంద్రావతి ప్రాంత కేడర్‌లు ఇప్పుడు లొంగుబాట పట్టారు. నారాయణపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరు సీనియర్ పోలీసులు, బిఎస్‌ఎప్, ఐటిబిపి అధికారుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు.

తాము నక్సలిజం సిద్ధాంతాలతో విసిగిపోయ్యామని , అంతర్గత తగాదాలు ఎక్కువ అయ్యాయని వీరు పోలీసు , ఇతర అధికారులకు తెలియచేసుకున్నారు. వీరంతా ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని జిల్లా ఎస్‌పి రాబిన్సన్ గురియా తెలిపారు. జిల్లాలోని మాడ్ ప్రాంతలో చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల వీరు ఆకర్షితులు అయ్యారని, వీటిలో తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధపడ్డారని, ఇది నక్సల్స్ సరెండర్ ప్రక్రియలో కీలక పరిణామం అని , దీనిని తాము స్వాగతిస్తున్నామని ఎస్‌పి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News