- Advertisement -
మయన్మార్‌లోని సెంట్రల్ సాగైంగ్ ప్రాంతంలోని బౌద్ధ ఆరామంపై జరిగిన వైమానిక దాడిలో ఆ ప్రాంగణంలో ఆశ్రమం పొందుతున్న కనీసం 23 మంది మరణించారని ప్రత్యేకవర్గాలు శుక్రవారం తెలిపాయి. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మండలేకు వాయువ్యంలో 35 కిమీ. దూరంలో ఉన్న ఆశ్రమంలో జరిగిన సంఘటనపై మయన్మార్ సైన్యం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో, సైన్యం లక్ష్యాలపైనే దాడిచేస్తామని, పత్రిఘటన దళాలను ఉగ్రవాదులని పేర్కొంది. ఫిబ్రవరి 2021లో ఎన్నికైన ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వం నుండి సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మయన్మార్ అల్లకల్లోలంగా ఉంది. ఇది అంతర్యుద్ధానికి దారితీసింది. శాంతియుత ప్రదర్శనలను బలప్రయోగం ద్వారా అణచివేసిన తర్వాత సైనిక పాలనను వ్యతిరేకించే వారు ఆయుధాలు చేపట్టారు. మయన్మార్ దేశంలో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం ఉంది.
- Advertisement -