- Advertisement -
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం 23 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వీరిలో మూడు జంటలు ఉన్నారని, వారిపై రూ. 1.18 కోట్ల నజరానా ఉందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. లంగిపోయిన నక్సలైట్లలో 11 మంది సీనియర్ కేడర్లు ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పిఎన్‌జిఎ) బెటాలియన్ నంబర్ 1లో చురుకుగా౩ ఉన్నారని, ఇది మావోయిస్టుల బలమైన సైనిక నిర్మాణంగా పరిగణించబడుతుందని పోలీసు అధికారి తెలిపారు. ‘బోలు’ మావోయిస్టు భావజాలం, అమాయక గిరిజనులపై నక్సలైట్లు చేసిన దురాగతాలు, నిషేధిత సంస్థలో పెరుగుతున్న అంతర్గత విభేదాల పట్ల తమ నిరాశను పేర్కొంటూ వారు సీనియర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సిఆర్‌పిఎఫ్) అధికారుల ముందు లొంగిపోయారని సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ తెలిపారు.
- Advertisement -