- Advertisement -
బంగారం ధరలు కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ధర కాస్త తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.490 తగ్గి తులం రూ. 96,540కి చేరిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర రూ.450 తగ్గి తులం రూ.91,130కి తగ్గిందని తెలిపింది. మంగళవారం వెండి ధరలు కూడా బాగానే తగ్గాయి. రూ.1000 తగ్గి కిలో రూ.97,500కు చేరింది. ఇక హైదరాబాద్‌లో ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం తులం రూ.87,100గా ఉండగా, 24 క్యారెట్ల ధర తులం రూ. 95,020 పలుకుతోంది. ఇక వెండి కిలోకు రూ.1.08 లక్షలు పలుకుతోంది.
- Advertisement -