Wednesday, May 21, 2025

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 25 మంది మావోలు హతం!

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. బస్తర్ ప్రాంతంలోని అబుజ్‌మద్ అడవుల్లో భారీ కాల్పులు జరుగుతున్నాయని.. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 25 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. అగ్ర క్యాడర్లకు చెందిన మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బలగాలు బుధవారం తెల్లవారుజామున సంయుక్త ఆపరేషన్ ప్రారంభించినట్లు నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ తెలిపారు.

ఈ క్రమంలో మావోయిస్టులు బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు మావోయిస్టులపై ఎదురుకాల్పులు జరిపారు. ఉదయం నుంచి అబుజ్‌మద్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని ప్రభాత్ కుమార్ తెలిపారు. ఈ కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించినట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News