Thursday, August 14, 2025

సాగర్‌ 26 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వరద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం శ్రీశైలం జలాశయం నుండి 1,72,774 క్యూసెక్కుల వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో డ్యామ్ అధికారులు 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,03,502 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుండి వరద నీరు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో గురువారం మధ్యాహ్నం 8 గేట్లను 10 అడుగుల నుండి 5 అడుగులకు కుదించారు. సాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 587.40 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టిఎంసిలు కాగా ప్రస్తుతానికి 305.7464 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,576 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 1540 క్యూసెక్కుల నీటిని, ఎస్.ఎల్.బి.సి ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని, రిజర్వాయర్ నుండి మొత్తం 2,36,958 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News