Thursday, May 8, 2025

కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

బీజపూర్ : ఛత్తీస్‌గఢ్ లోని బీజపూర్ జిల్లా సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బుధవారం ఉద యం భద్రతా బలగాలు, మావోయిస్టుల మ ధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో 26 మం ది మావోయిస్టులు మృతి చెందారు. ఏప్రిల్ 21 నుంచి ప్రారంభించిన ఆపరేషన్ సం కల్ప్ పేరున భారీ ఎత్తున ఉగ్రవాద నిర్మూలన చర్యలు చేపట్టడమైందని పోలీస్ అధికారి తెలియజేశారు.ఇప్పటివరకు 26 మృ తదేహాలను స్వాధీనం చేసుకోవడమైందని ఇంకా గాలింపు కొనసాగుతోందని చెప్పా రు. మృతులు ఏ క్యాడర్‌కు చెందిన వారో ఇంకా గుర్తించ వలసి ఉందని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ రిజర్వుగార్డు (డిఆర్‌జీ), బస్తర్ ఫైట ర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్), సిఎస్‌ఎఫ్ బలగాలకు చెందిన 24,000 మంది జవాన్లు సంయుక్తంగా ఈ భారీ ఆపరేషన్ లో పాల్గొన్నారు. దండకారణ్య స్పెషల్ జో న్ కమిటీ (డికెఎస్‌జెడ్‌సి) , మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కమిటీలకు చెందిన బెటాలియన్ నెం.1 కు చెందిన సీనియర్ క్యాడ ర్స్ సమాచారం తెలియడంతో ఆపరేషన్ చే పట్టారు. కర్రెగుట్టల్లో ఏప్రిల్ 24న ముగ్గు రు మహిళా నక్సల్స్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. పిఎల్‌జిఎ బెటాలియన్ నెం.1కు చెందిన వీరిపై రూ. 8 లక్షల వంతున నగ దు రివార్డు ఉంది.

వీరి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు, ఇతర పరికరాలు లభ్యమయ్యాయి. మే 5న ఇదే ప్రాం తంలో మహిళా నక్సలైట్ ఎన్‌కౌంటర్‌లో హతమైంది. ఇంకా అనేక మంది సీనియర్ మావోయిస్టు క్యాడర్లు ఈ ఆపరేషన్ సంక ల్ప్ లో మృతి చెందడం లేదా గాయపడడం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. కానీ వారి సహచరులు వారిని అడవుల్లోకి తీసుకుని పోయి ఉంటారని అంటున్నారు. వందలాది నక్సల్ స్థావరాలు , బంకర్లు ధ్వంసం అయ్యాయని భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, డిటొనేటర్లు, మందులు, ఇతర పరికరాలు లభ్యమయ్యాయని పోలీస్ అధికారులు చెప్పారు.కోబ్రాకు చెందిన అధికారితోపాటు భద్రతా సిబ్బందికి చెందిన ఆరుగురు మందుపాతర్ల వల్ల గాయపడ్డారని, వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది 168 నక్సలైట్లు హతమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News