Thursday, May 22, 2025

మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల ఎన్‌కౌంటర్‌

- Advertisement -
- Advertisement -

మరో 27 మంది హతం ఛత్తీస్‌గఢ్‌లోని
నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో
ఎదురుకాల్పులు మావోయిస్టులకు తీవ్ర
విఘాతం నక్సల్స్ ఏరివేత చర్యల్లో కేంద్రానికి
కీలక విజయం 30 ఏళ్ల నక్సల్స్ చరిత్రలో
జాతీయస్థాయి ప్రధాన కార్యదర్శి ఒకరు
ఎన్‌కౌంటర్‌లో మరణించడం ఇదే తొలిసారి
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుది
శ్రీకాకుళం జల్లా జియన్నపేట గ్రామం వరంగల్
ఆర్‌ఇసిలో ఇంజనీరింగ్ చదువుతూ నక్సల్
ఉద్యమంలోకి గెరిల్లా యుద్ధ వ్యూహాలు
రూపొందించడంలో, ఐఇడి వినియోగంలో
కేశవరావు దిట్ట 2018లో గణపతి రాజీనామాతో
మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా
బాధ్యతలు స్వీకరించిన నంబాల 2010లో
ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్ల
మృతికి సూత్రధారి చంద్రబాబుపై అలిపిరిలో
జరిగిన దాడి వెనుక నంబాల హస్తం భద్రతా
దళాల విజయం పట్ల గర్వంగా ఉంది : ప్రధాని
నక్సలిజం అణచివేత డెడ్‌లైన్‌కు దగ్గరలో
ఉన్నాం : కేంద్ర హోంమంత్రి నంబాల
మరణించినట్లు ఎక్స్ వేదికగా ధ్రువీకరించిన
అమిత్‌షా ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు
సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి :
పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి డిమాండ్

నారాయణ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మరో మారు భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ప్రాబల్యాన్ని వెన్నువిరిచేలా చేసిన ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది నక్సల్స్ మృతి చెందారు. మృతులలో నక్సలైట్ల అగ్రనేత , మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంకు చెందిన నంబాల కేశవ రావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు. ఎదురుకాల్పులు, భారీ స్థాయిలో నక్సల్స్ నేలకొరుగుతున్న బస్తర్ ప్రాంతంలోని దట్టమైన కీకారణ్యపు అబుజ్‌మడ్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ చర్య చోటుచేసుకుంది. నక్సల్స్ నిరోధానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ చేపట్టిన భారీ ఆపరేషన్‌లో ఇప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్ భద్రతా బలగాలకు భారీ విజయం కాగా, మావోయిస్టులకు ఇది పిడుగు పాటు అయింది.ఘటనలో మృతి చెందిన బసవరాజుకు తెలంగాణలోని వరంగల్‌తో కూడా సంబంధం ఉంది. ఆయన అక్కడనే రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చేశారు. ఆయన చాలా కాలం అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. పలు రకాల నక్సల్స్ దాడులు, ప్రత్యేకించి గెరిల్లా పోరులో ఆరితేరారు. ఆయన 70 సంవత్సరాల వయస్సులో, కేడర్‌కు అగ్రనాయకత్వ బాధ్యతలు వహిస్తున్నారు.

ఇప్పటి ఘటనలో భారీ సంఖ్యలో నక్సల్స్ హతులు కావడం, అగ్రనేత కూడా నేలకొరగడంపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా వేర్వేరుగా స్పందించారు. ఇది కీలక పరిణామం అని, కేంద్రం లక్ష సాధనలో ముందుకు దూసుకుపోతోందని పేర్కొన్నారు. భద్రతా సిబ్బందిని అభినందించారు. బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడల త్రికూడలి వద్ద అబూజ్‌మడ్ అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు స్థానిక పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు, సెంట్రల్ కమిటీ , పొలిట్‌బ్యూరో సభ్యులు పెద్ద సంఖ్యలో సమావేశం అవుతున్నారని ఇంటలిజెన్స్ సమాచారం అందింది. దీనితో ఈ ప్రాంతంలోకి గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. వీరికి స్థానిక పోలీసులు సహకరించారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా సైన్యం (పిఎల్‌జిఎ), సీనియర్ మాడ్ డివిజన్ కేడర్ వారు కూడా ఇక్కడనే ఉన్నారని సమాచారం అందింది. దీనితో వీరిని మట్టుపెట్టాలనే పెద్ద ఎత్తున దిగ్బంధానికి దిగారని వెల్లడైంది.

ఇప్పటికే 27 మృతదేహాలు లభ్యం
బుధవారం నాటి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 27 మంది నక్సలైట్ల భౌతిక కాయాలను అడవుల్లో చెట్లు పుట్టల మధ్య కనుగొన్నారు. గాలింపు సాగుతోంది. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎదురు కాల్పుల దశలో జిల్లా రిజర్వ్ రక్షక దళం ( డిఆర్‌జి)కి చెందిన జవాను ఒక్కరు మృతి చెందారు. ఘటన స్థలితో భారీ ఎత్తున ఆయుధాలను కైవసం చేసుకున్నారని ఛత్తీస్‌గఢ్ పోలీసు విభాగం తెలిపింది. ఇప్పటి ఆరోజటి ఘటనతో ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన నక్సలైట్ల సంఖ్య 200కు చేరుకుంది. వీరిలో 183 మందిని బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ, కొండగాన్ జిల్లాల నుంచే ఏరివేశారు.

బసవరాజు పేరుకు తగ్గట్లే అభేద్యపు రహస్యం
ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు చెపుతున్న కేశవరావు అలియాస్ బసవరాజు వయస్సు, ఆయన రూపం, ఏ విధంగా ఉంటారు? అనేది ఇప్పటికీ ఎక్కువగా ఎవరికీ తెలియదు. వయస్సు గురించి కూడా నిర్థారణ కాలేదు. 61 ఏండ్లు అని, కాదు ఆయన 71 సంవత్సరాల వయస్సులో కేవలం ఈ ప్రాంతానికి కేందీకృతం అయ్యి నక్సల్స్ ఆపరేషన్లు వ్యూహాత్మకంగా నిర్వర్తిస్తున్నారని చెపుతారు. ఆయనకు పలు తెలుగు మారు పేర్లు ఉన్నాయి. ప్రకాశ్, విజయ్ , కృష్ణ, కమ్లు , ఉమేష్ అనే పేర్లతో సంచరిస్తూ ఉంటారని తెలిసింది. ఆయన గెరిల్లా తరహా పోరులో పేరొందారు. మందుపాతరలు, పేలుడుపదార్థాల వాడకంలో దిట్ట అని దళాలలో గుర్తింపు ఉంది. భద్రతా బలగాలు, ఇంటలిజెన్స్‌వర్గాల వద్ద ఇప్పటికీ ఆయన తాజా ఫోటోలు లేవు. కేవలం యువకుడుగా ఉన్నప్పటి ఫోటోలు, ప్రత్యేకించి వరంగల్ ఆర్‌ఇసిలో విద్యార్థిగా ఉన్నప్పటి ఛాయాచిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకునే ఇప్పుడు మృతి చెందింది కేశవరావు అని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News