- Advertisement -
చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం జరిగింది. నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కుప్పం మండల పరిధిలోని దేవరాజ పురం గ్రామ పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. మృతులు గౌతమి (7), అశ్విన్ (7), శాలిని (6) గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో జలాశయం చూసేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
ఏలూరు జిల్లాలో జరిగిన ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. జల్లేరు జలాశయం చూసేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 10 ఏళ్ల సిద్దిఖ్, 7 ఏళ్ల అబ్దుల్ నీట మునిగడంతో మృతిచెందారు. చిన్నారుల మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
- Advertisement -