Wednesday, July 9, 2025

కూకట్‌పల్లి కల్తీ కల్లు కలకలం.. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: కూకట్‌పల్లి కల్తీ కల్లు బాధితుల్లో ముగ్గురు మృతి చెందారు. బుధవారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించగా.. ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎంటీ హిల్స్‌ సాయిచరణ్‌ కాలనీకి చెందిన తులసిరామ్‌(47), బొజ్జయ్య(55), నారాయణమ్మ(65)గా గుర్తించారు.

నిన్న కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించిన వారిలో 19 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. వైద్యం అందించిన డాక్టర్లు 24 గంటలు గడిస్తే గాని వారి పరిస్థితి చెప్పలేమని తెలిపారు. పలువురు బాధితులు వెంటిలేటర్స్‌పై చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరెకపూడి గాంధీలు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News