ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని బంజర గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చేపల వేటకు వెళ్లి కట్టలేరు నదిలో గల్లంతైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… బంజరకు చెందిన 9 మంది వ్యక్తులు మీనవోలు బ్రిడ్జి సమీపంలోని కట్టలేరులో చేపలు పట్టేందుకు సాయంత్రం మూడు గంటల సమయంలో నదిలోకి దిగగా అందులో ముగ్గురు వ్యక్తులు బాధావత్ రాజు (55), భూక్యా కోటి (46), భూక్యా సాయి (25) లు కట్టలేరు లోతు తెలియక పోవటంతో ఈత రాక నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. తోటి వ్యక్తులు వీరిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమవడంతో స్థానిక అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తహశీల్దార్ ఎం ఉషా శారద, సీఐ మధు, ఎస్సై రమేష్‌లు ఫైర్ సిబ్బందిని, గజ ఈతగాళ్ళను రప్పించి గాలింపు చర్యలను చేపట్టారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
చేపలు వేటకు వెళ్లి ముగ్గురు గల్లంతు
- Advertisement -
- Advertisement -
- Advertisement -