Saturday, July 19, 2025

విరిగిపడిన కొండచరియలు.. ముగ్గురు సైనికులు మృతి.. ఆరుగురు మిస్సింగ్

- Advertisement -
- Advertisement -

గాంగ్‌టక్: ప్రకృతి ప్రకోపానికి సిక్కింలో (Sikkim) దారుణం చోటు చేసుకుంది. మాగాన్ జిల్లాలోని లాచన్ నగరంలో ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో కొండచరియలు విరిగి ఆర్మీ కాంప్‌‌పై పడ్డాయి. ఈ దుర్ఘటనలో ముగ్గుర సైనికులు (Soldiers) మృతి చెందగా.. మరో ఆరుగురు ఆచూకీ దొరకడం లేదు. మృతి చెందిన వ్యక్తులు హవల్దార్ లఖ్వీందర్ సింగ్, లాన్స్ నాయక్ మునీష్ ఠాకూర్, పోర్టర్ అభిషేక్ లఖడాగా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టంకి తరలించారు. గల్లంతైన ఆరో ఆరుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన ముగ్గురు సైనికులకు భారత ఆర్మీ సంతాపం తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News