- Advertisement -
కారు బోల్తా పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన బాపట్ల జిల్లాలోని చీరాల మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం చీరాల వాడరేవు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో యువకులు ప్రాణాలు కోల్పోగా..మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బాధిత యువకులు తెనాలి నుంచి వాడరేవు బీచ్‌కు కారులో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని రోహిత్ నాయక్(19), అజయ్(18), కార్తీక్(24)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుజ.
- Advertisement -