- Advertisement -
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కర్రెగుట్టలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టు(Operation Black Forest) నిర్వహించామని సిఆర్‌పిఎఫ్ డిజి డిటి బెనర్జీ అన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 20 రోజుల పాటు కాల్పులు, బాంబుల మోతతో దద్దరిల్లిన కర్రెగుట్ట ప్రస్తుతం ప్రశాంతంగా మారిపోయింది. కర్రెగుట్టలో 20 రోజుల ఎదురుకాల్పుల వివరాలను బీజాపూర్ సిఆర్‌పిఫ్ డిజి, డిజిపి వెల్లడించారు. 20 రోజుల్లో 31 మంది మావోయిస్టులు(Maoists) మృతి చెందారని పేర్కొన్నారు. ఈ క్రమంలో 18 మంది జవాన్లు గాయపడినట్లు వెల్లడించారు. కర్రెగుట్టలో 450 మందుపాతర్లను గుర్తించామని తెలిపారు. చనిపోయిన మావోయిస్టులపై రూ.1.72 కోట్ల రివార్డులు ఉన్నాయని స్పష్టం చేశారు. 214 బంకర్లను గుర్తించి ధ్వంసం చేశామని.. బంకర్లలో భారీగా తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
- Advertisement -