Wednesday, May 14, 2025

ఆపరేషన్ కగార్.. 20 రోజుల్లో 31 మంది మావోలు హతం

- Advertisement -
- Advertisement -

కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులతో కలిసి సీఆర్‌పీఎఫ్‌ డీజీ వెల్లడించారు. కర్రెగుట్టలో 20 రోజులపాటు కూంబింగ్ నిర్వహించామని తెలిపారు. మావోయిస్టులు, బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు. కూంబింగ్‌లో భాగంగా 18 మంది జవాన్లు గాయపడ్డారని తెలిపారు. కర్రెగుట్టలో దాదాపు 450 మందుపాతర్లు గుర్తించి నిర్వీర్యం చేశామని చెప్పారు. కర్రెగుట్టలో 214 బంకర్లు గుర్తించి.. ధ్వంసం చేశామని వెల్లడించారు. బంకర్లలో పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News