Friday, July 11, 2025

అమెరికాలో కూలీలకు తప్పిన ముప్పు

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని లాస్ ఎంజిలెస్ ప్రాంతంలో 31 మంది నిర్మాణ కార్మికులకు గండం గడిచింది. ఇండస్ట్రియల్ టన్నెల్‌నిర్మాణ పనులలో ఉన్న వీరిపై పై కప్పు కొంతభాగం కూలింది. దీనితో సొరంగ మార్గం మూసుకుపోయింది. అయితే కూలీలు సురక్షితంగా బయటకు వచ్చారు. భారీ ప్రమాదం జరిగి ఉంటుందని అనుకున్నామని, అయితే ఏదో శక్తి వల్లనే వీరు బయటపడ్డారని లాస్ ఎంజిలెస్ కౌంటీ శానిటేషన్‌అధికారులు గురువారం తెలిపారు. ఈ విభాగం ఆధ్వర్యంలోనే ఇక్కడ దాదాపు 700 మిలియన్ డాలర్ల వ్యయ అంచనాలతో టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. ఏకైక మార్గం గుండానే కార్మికులు లోపలికి వెళ్లుతారు. తొమ్మిది కిలోమీటర్ల లోపల కార్మికులు పనుల్లో ఉండగా ప్రమాదం జరిగింది. పూర్తిగా బురదమయంగా ఉన్న నేలపై నుంచే కార్మికులు అష్ఠకప్టాలు పడి ముందుకు ముఖద్వారం వద్దకు చేరుకున్నారు.వెంటనే వీరిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News