ప్రపంచంలోనే కరడుగట్టిన టెర్రరిస్ట్ సంస్థ అల్ -ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు టెర్రరిస్ట్ లను గుజరాత్ యాంటీ- టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) అరెస్ట్ చేసింది. వారిలో ఒకరిని వేరే రాష్ట్రంలో అరెస్ట్ చేసినట్లు ఏటిఎస్ పేర్కొంది. ఈ టెర్రరిస్ట్ లు నకిలీ
కరెన్సీ రాకెట్ ను నడుపడమే కాక, అల్ ఖైదా భావజాలాన్ని ప్రచారం చేస్తూ, పలువురిని టెర్రరిజం వైపు ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. అరెస్ట్ చేసిన టెర్రరిస్ట్ లను మొహమ్మద్ షైక్, మొహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా ఖురేషి, జీషన్ అలీ గా గుర్తించారు. వారు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను, కొన్ని యాప్ లను ఉపయోగించి వారు అల్ ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వారు తమ జాడ , కమ్యునికేషన్ పాదముద్రలు ఎవరికీ తెలియకుండా శుభ్రం
చేసేందుకు హై ఆటో- డిలీట్ యాప్ లను ఉపయోగిస్తున్నారని గూఢచారి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వారు నలుగురిని విచారిస్తున్నారు. రాష్ట్రంలో టెర్రరిస్ట్ కార్యకలాపాల గురించి చర్చిస్తున్నట్లు గుర్తించిన తర్వాత వారు నలుగురు ఏటీఎస్ రాడార్ కు చిక్కారు.