- Advertisement -
ఇంఫాల్ : మణిపూర్లో త్వరలో ప్రధాని మోడీ పర్యటించనున్న సమయంలో ఫుంగ్యార్ నియోజకవర్గానికి చెందిన 40 మంది బీజేపీ సభ్యులు గురువారం మూకుమ్మడి రాజీనామా చేశారు. నాగా మెజారిటీ జిల్లా ఫుంగ్యార్ మండలానికి చెందిన మండల అధ్యక్షుడు, మహిళా, యువ, కిసాన్ మోర్చాలకు చెందిన సభ్యులే కాకుండా నియోజకవర్గం లోని బూత్ స్థాయి అధ్యక్షులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. అయితే ఈ రాజీనామాలపై రాష్ట్ర బిజేపి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. పార్టీలోని ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాలకు తాము ఆందోళన చెందుతున్నామని వారొక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీకి, పార్టీ సిద్ధాంతాలను తామెప్పుడూ గౌరవిస్తామని, మణిపూర్ ప్రజలకు, తమ సామాజిక వర్గ సంక్షేమానికి కృషి చేస్తామని ప్రకటించారు.
- Advertisement -