Sunday, August 31, 2025

తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సింది మేము కాదు బిజెపి: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావొద్దని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.  పంచాయతీ, మున్సిపాలిటీల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా శ్రీధర్ బాబు శాసన సభలో ప్రసంగించారు. ప్రజల సమస్యలపై చర్చ కోసం సభను 15 రోజులు నిర్వహించాలని డిమాండ్లు వస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. వర్షాలు, వరదలు, నిమజ్జనాలను దృష్టిలో పెట్టుకొని సభపై నిర్ణయం తీసుకుంటామని, బిసి బిల్లుపై ప్రతిపక్షాలు తొలి నుంచి నెగిటివ్ ఆలోచనతోనే ఉన్నాయన్నారు. బిసి సబ్ ప్లాన్ పెట్టమని అప్పట్లో బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడారని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సింది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అని స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పవర్‌లోకి వస్తే 50 శాతం సీలింగ్ ఎత్తేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారన్నారు.

బిసిలకు న్యాయం చేసే బిల్లులకు బిఆర్‌ఎస్ సమర్ధిస్తారో లేదో చెప్పాలని నిలదీశారు. బిసి బిల్లులకు సంబంధించి అంశాలపైనే విపక్షాలు మాట్లాడాలని శ్రీధర్ బాబు సూచించారు. పంచాయతీ, మున్సిపల్లో 50 శాతం కోటా మించొద్దని చట్టాలున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు. పాత చట్టాల్లోని 50 శాతం కోటా ఎత్తేస్తూ సవరణ బిల్లులు తీసుకొచ్చామని వివరణ ఇచ్చారు. రాజకీయంగా బలహీన వర్గాలకు అన్యాయంపై కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని, జనాభా పరంగా బిసిలకు అన్యాయం జరుగుతోందని కమిటీ తెలిపిందన్నారు. బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకే సవరణ బిల్లులు తీసుకొచ్చామన్నారు. సవరణ బిల్లులతో పంచాయతీ, మున్సిపాలిటీల్లో బిసిలకు న్యాయం జరుగుతుందని,

Also Read: తీర్పులపై వక్రభాష్యాలు.. ఇదేం తీరు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News