Saturday, July 12, 2025

బిసిలకు 42% రిజర్వేషన్లు.. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయంపట్ల హర్షం: బుర్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: రాష్ట్రంలో కుల గణన సర్వే ఆధారంగా రానున్న స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం పట్ల బిసి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటిన బిసిలు ఇంకా పేదరికం, ఆకలి, నిరుద్యోగం, నయవంచన, దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బిసిలను రాజకీయంగా వాడుకొని పదవులలో అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బిసిలకు సముచిత స్థానం కల్పిస్తామని ఇచ్చిన మాటను అమలులోకి తీసుకురావడం హర్షించదగ్గ విషయమన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర మంత్రివర్గానికి, ముఖ్యమంత్రికి బిసి రిజర్వేషన్ సాధన సమితి పక్షాన శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బిసి రిజర్వేషన్ సాధన సమితి జిల్లా నాయకులు కలిమెల నర్సయ్య, మండల అధ్యక్షులు శివార్ల శ్రీనివాస్ యాదవ్ ,పట్టణ అధ్యక్షులు నిలిగొండ మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News