Wednesday, April 30, 2025

ట్రక్కులో 46 మృతదేహాలు…

- Advertisement -
- Advertisement -

46 found dead in Truck at texas

 

న్యూయార్క్: ట్రక్కులో 46 మృతదేహాలు గుర్తించిన సంఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగింది. మెక్సికో సరిహద్దుకు 250 కిలో మీటర్ల దూరంలో శాన్ అంటోనియా నగరానికి సమీపంలో ఓ రైల్వే ట్రాక్ పక్కన ట్రక్కు ఆగి ఉంది. ట్రక్కు పక్కన శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రక్కు వెనక భాగంలో డోర్ ఓపెన్ చేయగా 46 మృతదేహాలు కనిపించాయి. 18 టైర్లు ఉన్న ట్రక్కులో మానవ రవాణా చేస్తుండగా ఉక్కపోతతో వారు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News