Thursday, September 4, 2025

49 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

- Advertisement -
- Advertisement -

2025 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రస్థాయి పురస్కారాలకు 49 మంది ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసింది. శుక్రవారం(సెప్టెంబర్ 5) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. మొత్తం 49 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రకటించగా, అందులో 10 మంది ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, 21 మంది స్కూల్ అసిస్టెంట్లు, పిడిలు, 12 మంది ఎస్‌జిటిలు, టిజిటిలు ఉన్నారు. అదేవిధంగా ఎయిడెడ్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు చెందిన ఆరుగురు ఉపాధ్యాయులకు అవార్డులను ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

వివిధ యూనివర్సిటీల అధ్యాపకులకు అవార్డులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, అనుబంధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విశేష సేవలు అందించిన అధ్యాపకులకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నలుగురు, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన వర్సిటీ, పాలమూరు వర్సీటీ, మహాత్మాగాంధీ వర్సిటీ, వీరనారి చాకలిఐలమ్మ మహిళా వర్సిటీ, డా.బి.ఆర్.అంబేడ్కర్ వర్సిటీల నుంచి ఒక్కొక్క అధ్యాపకుడి చొప్పున అవార్డులకు ఎంపికయ్యారు. వీరితోపాటు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులు ఉన్నారు. ఈ మేరకు అవార్డులకు ఎంపికైనవారి జాబితాను ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు.

ఉత్తమ ఉపాధ్యాయులు వీరే

గెజిటెడ్ హెడ్ మాస్టర్స్/ప్రిన్సిపాల్స్ కేటగిరీ
1.సిహెచ్ శంకర్, జిహెచ్‌ఎం, జెడ్‌పిహెచ్‌ఎస్ బోర్గాన్, నిజామాబాద్
2. పి.నిర్మల జ్యోతి, జిహెచ్‌ఎం, జెడ్‌పిహెచ్‌ఎస్ మల్యాల, యాదాద్రి
3. మైస అరవింద్‌కుమార్, జిహెచ్‌ఎం, జెడ్‌పిహెచ్‌ఎస్ పొంకల్, నిర్మల్
4. విద్యాసాగర్, జిహెచ్‌ఎం, జెడ్‌పిహెచ్‌ఎస్, సంగారెడ్డి
5. పానుగోటు చత్రు, జిహెచ్‌ఎం, జెడ్‌పిహెచ్‌ఎస్ గరిడెపల్లి, సూర్యాపేట
6. జి.రమేష్, జిహెచ్‌ఎం, జెడ్‌పిహెచ్‌ఎస్ మజీద్‌పల్లి, సిద్దిపేట
7. డి.రాంరెడ్డి, జిహెచ్‌ఎం, పిఎంశ్రీ జెడ్‌పిహెచ్‌ఎస్ నర్కుడ, రంగారెడ్డి
8. పి.రేఖ, జిహెచ్‌ఎం, జెడ్‌పిహెచ్‌ఎస్ జిజిహెచ్‌ఎస్ మెదక్
9. గడ్డం శశికళ, జిహెచ్‌ఎం, జెడ్‌పిహెచ్‌ఎ పిప్పర్‌వాడ, అదిలాబాద్
10. ఎన్.తారాసింగ్,ప్రిన్సిపాల్, టిజిఆర్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, మెదక్
స్కూల్ అసిస్టెంట్స్ కేటగిరీ 2
1.అవుసుల భాను ప్రకాష్
2. అబ్దుల్ ఖాలిక్
3. కొండ్ర తిరుపతి,
4. యర్మల చిన బ్రహ్మయ్య
5. రాఘవపురం గోపాలకృష్ణ
6. పర్చల సత్య శ్రీదేవి
7. వాకిట శ్రీదేవి
8. బోనగిరి నరేందర్
9. డముక కమలాకర్
10. డాక్టర్ గొల్లపల్లి గణేష్
11. ఎం.దేవన్న
12. కడవేరు సత్యనారాయణ
13. చెడిపాక రాములు
14. డబ్దుగుల ఎల్లయ్య
15. పి.రమాదేవి
16. గీట్ల భరత్‌రెడ్డి
17. రాదరపు సునీత
18. ముప్పళ్ల కవిత
19. అవుసుల సాయిలు
20. నూకల లింగయ్య
21. కొండ కవిత
ఎస్‌జిటి/పిఇటి కేటగిరీ
1.దంతల సుధాకర్‌రావు
2. ముడెం స్వామి
3. బొంపల్లి భవాని
4. బుక నాగయ్య
5. కె.బాలాజీ
6. పి.రేవతి
7. ఎన్.విష్ణువర్ధన్
8. దరిపల్లి స్వరూప
9. నీలం శ్రీదేవి
10. కె.నర్సింహ
11. టి.రాజేష్‌కుమార్
12. హెచ్.ఎన్. మానిమాల
ఎయిడెట్ స్కూల్స్ కేటగిరీ
1. ఎం.జగదీశ్వర్‌రెడ్డి, హెడ్‌మాస్టర్
2. జి.కళావతి, స్కూల్ అసిస్టెంట్
3. టి.ఎల్.నరేందర్, డ్రాయింగ్ టీచర్
తెలంగాణ మోడల్ స్కూల్ కేటగిరీ
1.జి.శివ కృష్ణ, పిజిటి
2. జోయి ప్రవీణ్, టిజిజి
కెజిబివి కేటగిరీ
1.జి.సుమన చైతన్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News