Monday, May 12, 2025

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ఐదుగురు సైనికులు చనిపోయారు: రాజీవ్‌ ఘాయ్‌

- Advertisement -
- Advertisement -

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ఐదుగురు సైనికులు అమరులయ్యారని డిజిఎంఓ రాజీవ్‌ ఘాయ్‌ చెప్పారు. ఆదివారం వీడియా సమావేశంలో ‘ఆపరేషన్ సిందూరు‘ అనంతరం నెలకొన్న పరిస్థితుల వివరాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్ అమరులైన ఐదుగురు జవాన్లు, ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం తెలిపారు.అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు.

“ఆపరేషన్ సిందూర్ లో 21 ఉగ్రవాద శిబిరాలను టార్గెట్‌ చేశాం. అవసరమైతే మిగిలినవాటిపై ముందు ముందు దాడి చేస్తాం. ఉగ్రవాదుల అంతిమయాత్రలో ఎవరెవరు పాల్గొన్నారో ప్రపంచమంతా చూసింది. పాక్‌ జెట్లను చాలా కూల్చేశాం. అవి ఎన్ని అనేవి ఇప్పుడు చెప్పలేం. మా లక్ష్యాలన్నింటినీ అందుకున్నాం. పైలట్స్‌ అందరూ తిరిగివచ్చారు. భారత్‌ పైలట్‌ను పట్టుకున్నామన్న పాక్‌ అసత్య ప్రచారం చేసింది. పాక్‌ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే..మరింత బలంగా దాడి చేస్తాం” అని రాజీవ్‌ ఘాయ్‌ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News