Tuesday, July 8, 2025

చేతబడి అనుమానం.. ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్‌లో ఓ కుగ్రామంలో చేతబడి మూఢనమ్మకం చివరికి ఓ నిండు కుటుంబాన్ని అగ్నికి ఆహుతి చేసింది. ఐదుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనం అయ్యారు. పూర్నియా జిల్లాలోని టెట్గామా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసు వర్గాలు సోమవారం తెలిపాయి. కుటుంబం వారు చేతబడులకు దిగుతున్నారని, పలువురిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని అనుమానం పెనుభూతం అయింది. ఆదివారం రాత్రి ఊరంతా నిద్రిస్తున్నప్పుడు 50 మందితో కూడిన మూక సీతాదేవీ అనే మహిళ ఇంటిపై దాడికి దిగింది. ఆమె, కుటుంబ సభ్యులు మంత్రాలకు చేతబడులకు దిగుతున్నారని పేర్కొంటూ ఇంట్లోకి దూరి, అందరిని ముందుగా చితకబాదారు.

సీతాదేవి కొడుకు 16 సంవత్సరాల సోను కుమార్ ఏదో విధంగా వారి బారిన పడకుండా తప్పించుకుని బయటపడ్డాడు. బడితెలు పట్టుకుని వచ్చిన వారు ఇంటిలోని వారిపై పెట్రోలు పోసి తగులబెట్టారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గాలింపు తరువాత శవాలను కనుగొన్నారు. గ్రామంలో ఓ ఇంట్లో వ్యక్తులు అనుమానాస్పద రీతిలో చనిపోతూ ఉండటంతో సీతాదేవీ కుటుంబమే చేతబడులకు దిగిందని నమ్మి గుంపు దారుణానికి పాల్పడిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News