- Advertisement -
కారులో ఊపిరాడక ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండల పరిధిలోని మక్తమాదారంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన అఖ్యారి యాదయ్య, మహేశ్వరి దంపతుల కూతురు అక్షయ (5) కారులో సోమవారం ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు. భార్యభర్తలిద్దరూ కారు దిగి ఇంట్లోకి వెళ్లారు. కుమార్తె కూడా కారు దిగి తమ వెంటనే వచ్చిందనుకుని కారు డోర్‌కు లాక్ వేశారు.అయితే, కారులో ఉన్న చిన్నారి ఊపిరాడక అందులోనే చనిపోయింది. ఎంతసేపటికీ తమ చిన్నారి కనబడడం లేదని వెతికిన తల్లిదండ్రులకు సాయంత్రం 5 గంటలకు కారులో ఉన్నట్టు గమనించారు. బాలిక తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చందా గంగాధర్ తెలిపారు.
- Advertisement -