విచారణ యాబై నిమిషాల పాటు జరగగా జస్టిస్ పిసిఘోష్ అడిగిన 18 ప్రశ్నలకు మాజీ సిఎం కెసిఆర్ సమాదానాలు ఇచ్చారు. కొన్ని సమాధానాలు మౌఖికంగా, మరికొన్నింటికి తనవద్ద ఉన్న పత్రాల రూపంలో అందజేశారు. ఇందులో ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల నిర్మాణాలకు నిర్ణయం ఎక్కడ జరిగిందని ప్రశ్నించగా, దానికి సమాధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వోపరాలు, రీ ఇంజినీరింగ్ అంశాలను కెసిఆర్ కమిషన్‌కు సవివరంగా వెల్లడించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని
నిర్ణయాలకు అధికారికంగా మంత్రివర్గం ఆమోదం ఉందని కూడా కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు రీ డిజైనింగ్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సిఫార్సుల మేరకే జరిగిందని ఆయన వెల్లడించారు. అలాగేకేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు జరిగినట్లుగా వివరించారు. అందుకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పిపిపి)ను కమిషన్‌కు ఆయన అందజేశారు.